మొదలైన ఏడాదికే విడుదల?
మొదలైన ఏడాదికే ప్రభాస్ సినిమా విడుదలకావడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమేనా? అంటే ‘అసాధ్యం’ అనే సమాధానమే వస్తుంది. కానీ దాన్ని సాధ్యం చేసే పనిలో బిజీగా ఉన్నారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. ప్రస్తుతం ది రాజాసాబ్, ఫౌజీ షూటింగుల్లో బిజీగా ఉన్నారు ప్రభాస్.
మొదలైన ఏడాదికే ప్రభాస్ సినిమా విడుదలకావడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమేనా? అంటే ‘అసాధ్యం’ అనే సమాధానమే వస్తుంది. కానీ దాన్ని సాధ్యం చేసే పనిలో బిజీగా ఉన్నారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. ప్రస్తుతం ది రాజాసాబ్, ఫౌజీ షూటింగుల్లో బిజీగా ఉన్నారు ప్రభాస్. వీటిలో ‘ది రాజాసాబ్’ షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ ఏడాది లోపు ‘ఫౌజీ’ షూటింగును కూడా ప్రభాస్ కంప్లీట్ చేయనున్నారు. వచ్చే ఏడాదంతా ఆయన ‘స్పిరిట్’ సినిమాకే డేట్స్ కేటాయించారని ఇప్పటివరకూ వార్తలొచ్చాయి.
కానీ అందులో ఏ మాత్రం నిజం లేదని సందీప్‌రెడ్డి వంగా టీమ్ చెబుతున్నారు. సందీప్ వర్కింగ్ ైస్టెల్ భిన్నంగా ఉంటుందనీ, ఇప్పటికే ‘స్పిరిట్’ ప్రీప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నదని, బౌండ్ స్క్రిప్ట్‌తో ఆయన లొకేషన్లోకి ఎంటరవుతారని, షూటింగ్‌కి సందీప్ కేటాయించింది కేవలం ఆరు నెలలు మాత్రమేనని చిత్రబృందం పేర్కొన్నది. మిగతా ఆరు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి, సరిగ్గా షూటింగ్ మొదలైన ఏడాదికి ‘స్పిరిట్’ని విడుదల చేసేందుకు సందీప్ ప్లాన్ చేశారట. నిజంగా ఇది డార్లింగ్ అభిమానులకు శుభవార్తే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Market | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 1,109 పాయింట్లు లాభం
అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల్లో అవగాహణ ఎంతో అవసరం
Jatayu | ‘రామాయణం’లో జటాయువుగా అనుపమ్ ఖేర్!
CPR | సీపీఆర్ అంటే ఏమిటి.. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఇది ఎందుకు కీలకం..
రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలకు భీమవరం విద్యార్థినులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

