Pooja Hegde | బాలీవుడ్లో ఓ స్టార్ హీరోతో పూజా హెగ్డే ప్రేమలో ఉందన్న వార్తలు ఇటీవల బహుళ ప్రచారంలోకి వచ్చాయి. పూజా ప్రస్తుతం ఆ స్టార్ హీరోతో డేటింగ్ చేస్తున్నది అనేది బీటౌన్‌లో వినిపిస్తున్న మాట. ఈ విషయంపై తాజా ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చిందీ నాయిక. పూజా హెగ్డే మాట్లాడుతూ…‘దీని గురించి నేనేం చెప్పాలి. ఇలాంటివి రోజూ చదువుతూనే ఉంటాను. ప్రస్తుతానికి నేను సింగిల్‌గానే ఉన్నా. అలా ఒంటరిగా ఉండటమే నాకు ఇష్టం. నేనెవరినీ ప్రేమించడం లేదు, ఎవరితో డేటింగ్ చేయడం లేదు.
పూర్తిగా నా కెరీర్ మీదే దృష్టి పెడుతున్నా. దేశవ్యాప్తంగా వివిధ భాషల సినిమాల్లో నటించాలని ప్రయత్నిస్తున్నా. ఈ బిజీలో వదంతుల గురించి పట్టించుకునే సమయం లేదు’ అని చెప్పింది. దక్షిణాదితో పాటు హిందీలో సినిమాలు చేస్తున్న పూజా…ఇటీవల ‘సర్కస్’ అనే సినిమా చేసింది. ప్రస్తుతం సల్మాన్‌తో కలిసి ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ చిత్రంలో నటిస్తున్నది. త్వరలో సల్మాన్‌తో ‘పవన పుత్ర’ అనే సినిమా చేస్తున్నది. దీంతో సల్మాన్ పూజా రిలేషన్‌పై వార్తలొస్తున్నాయి.