రితిక సింగ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఇన్ కార్’. హర్షవర్ధన్ దర్శకుడు. ఇన్బాక్స్ పిక్చర్స్ పతాకంపై అంజుమ్ ఖురేషి, సాజిద్ ఖురేషి నిర్మిస్తున్నారు. మార్చి 3న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించాం. అత్యాచారాలకు పా ల్పడే వ్యక్తుల మనస్తత్వం ఎలా ఉంటుంది? వారు మహిళల పట్ల క్రూరంగా ఎందుకు ప్రవర్తిస్తారనే అంశాల్ని చర్చించాం. మహిళలు శారీరకంగానే కాదు మానసికంగా కూడా హింసకు గురవుతున్నారనే విషయాన్ని ఈ సినిమాలో చూపించాం’ అన్నారు. నేరాల పట్ల మహిళల్లో అవగాహన కలిగించే చిత్రమిదని కథానాయిక రితిక సింగ్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: మిథున్ గంగోపాధ్యాయ, రచన-దర్శకత్వం: హర్షవర్దన్.