కొత్తదనానికే ప్రాధాన్యత
‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ చిత్రాన్ని పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించాం. నా పాత్ర భిన్న పార్శాల్లో సాగుతుంది. నటుడిగా సరికొత్త గుర్తింపును తీసుకొస్తుంది’అని అన్నారు లక్ష్ చదలవాడ. ఆయన కథానాయకుడిగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’.చదలవాడ శ్రీనివాసరావు నిర్మాత. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ సందర్భంగా హీరో లక్ష్ మాట్లాడుతూ ‘నేను గతంలో నాలుగు సినిమాలు చేశాను. రొటీన్‌కు భిన్నమైన కథల్లో నటించాలనే ఉద్దేశ్యంతో విరామం తీసుకున్నా. ఓ కాల్పనిక పట్టణంలో జరిగే కథగా ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ను తెరకెక్కించాం. దేవరలంక అనే ప్రాంతంలో కథ నడుస్తుంది. నాయక, ప్రతినాయక ఛాయల కలబోతగా నా పాత్ర వైవిధ్యంగా అనిపిస్తుంది. యాక్షన్ చిత్రమైనా ఇందులో చక్కటి ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఉంటుంది. గతంలో నా వయసుకు మించిన పాత్రలు చేయడంతో గుర్తింపు రాలేదు. ప్రస్తుతం కథల ఎంపికలో కొత్తదనానికే పెద్దపీట వేస్తున్నా. 20 కిలోల బరువు తగ్గాను. నన్ను నేను కొత్త పంథాలో ఆవిష్కరించుకోవాలనే తపనతో పనిచేస్తున్నా’అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

