ఫస్ట్‌డే.. ఫస్ట్‌షో ఆ కిక్కే వేరు!
సీనియర్ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మిస్తున్న చిత్రం ‘ఫస్ట్‌డే ఫస్ట్‌షో’. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ పుట్టంశెట్టి ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. ‘జాతిరత్నాలు’ ఫేమ్ దర్శకుడు అనుదీప్ కేవీ ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే అందించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను ఇటీవల హీరో నాని విడుదల చేశారు.
నిర్మాత మాట్లాడుతూ ‘యూత్‌ఫుల్ రొమ్‌కామ్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రమిది. సినిమాలో కథానాయకుడు తన ప్రేయసితో కలిసి ‘ఖుషి’ సినిమా ఫస్ట్‌డే ఫస్ట్‌షో చూడటం ఈ చిత్ర కథాంశం. పూర్తి వినోదాత్మకంగా ప్రేక్షకులను నవ్వించడమే ధ్యేయంగా నిర్మించిన చిత్రమిది. ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. చిత్రం కూడా ప్రేక్షకులకు వంద శాతం వినోదాన్ని అందిస్తుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రాధన్, సమర్పణ: ఏడిద శ్రీరామ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

