సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కాలింగ్ సహస్ర’. విక్కిరాలా దర్శకుడు. విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కటూరి నిర్మాతలు. ఈ చిత్రం నుంచి కలయా నిజమా అనే లిరికల్ వీడియోను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్. ఈ చిత్రంలో పూర్తి వైవిధ్యమైన సుధీర్ కనిపిస్తాడు. చిత్రంలో వుండే ట్విస్ట్‌లు, టర్న్‌లు ప్రేక్షకులకు థ్రిల్‌ను కలిగిస్తాయి.
తప్పకుండా చిత్రం అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘చిత్ర గారు మా సినిమాలో పాట పాడటం ఆ పాటకు, మా చిత్రానికి మరింత గౌరవం వచ్చింది. మంచి టీమ్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు శివబాలాజి, హీరోయిన్ డాలిశ్య తదితరులు పాల్గొన్నారు.