నిప్పులాంటి పోలీస్
శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న సినిమా ‘అల్లూరి’. ఈ చిత్రంలో పోలీస్ అధికారి పాత్రలో ఆయన నటిస్తున్నారు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కయాదు లోహర్ నాయికగా నటిస్తున్నది. ఒక పాట మినహా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు. శుక్రవారం ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు ప్రదీప్ వర్మ మాట్లాడుతూ…‘నిజాయితీ గల ఒక పోలీస్ అధికారి ఫిక్షనల్ బయోగ్రఫీ ఇది. ఎస్ఐగా బాధ్యతలు తీసుకున్న తొలి రోజు నుంచి సమాజంలో మంచిని కాపాడేందుకు అతను ఎలా ప్రయత్నించాడు? ఈ క్రమంలో ఉన్నతాధికారుల నుంచి, రాజకీయ నాయకుల నుంచి ఆ పోలీస్ అధికారి ఎలాంటి ఒత్తిళ్లను ఎదుర్కొన్నాడు?
విధి నిర్వహణలో అతను చేసిన త్యాగాలు ఏంటి? డిపార్టెంట్‌లో అతనెలాంటి మార్పులు తీసుకొచ్చాడు? అనేది సినిమాలో ఆసక్తికరంగా తెరక్కెకిస్తున్నాం. కర్తవ్యానికి ప్రాధాన్యతనిచ్చే గొప్ప పోలీస్ అధికారులందరికీ ఈ సినిమా ఒక అద్దంలా నిలుస్తుంది’ అని అన్నారు. తనికెళ్ల భరణి, సుమన్, రాజా రవీంద్ర తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : రాజ్ తోట, సంగీతం : హర్షవర్థన్ రామేశ్వర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

