KGF Chapter-2 | ప్రస్తుతం ఐపీఎల్‌ను మించిన హవా దేనికైనా ఉందంటే అది ‘కేజీఎఫ్-2’ చిత్రానికి మాత్రమే అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. సినిమా విడుదలై పది రోజులు దాటిన ‘కేజీఎఫ్’ మేనియా ఏమాత్రం తగ్గలేదు. సౌత్ నుంచి నార్త్ వరకు ఎక్కడ చూసిన కేజీఎఫ్-2 హవానే నడుస్తుంది. ప్రశాంత్ నీల్ టేకింగ్, విజన్‌ను చూడడానికి ప్రేక్షకులు రిపీటెడ్‌గా వస్తున్నారు. యష్ నటన, అభినయానికి ప్రశంసలు జల్లులు కురుస్తున్నాయి. బాలీవుడ్లో తాజాగా ఈ చిత్రం 300కోట్ల క్లబ్లో అడుగుపెట్టింది. ఈ చిత్ర విజయంలో రవిబస్రూర్కు సగం వరకు క్రెడిట్ దక్కుతుంది. ఈయన స్వర పరిచిన పాటలు,బాక్గ్రౌండ్ మ్యూజిక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో పాటలు కూడా విపరతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం ప్రేక్షకులకు బిగ్ సర్ప్రైజ్ను ఇచ్చింది.
ఈ చిత్రంలోని ‘ఎవ్రిబడి ఈజ్ ఎ గ్యాంగ్ స్టర్.. టిల్ యు సీ ద మాన్స్టర్’ అంటూ సాగే ప్రమోషనల్ సాంగ్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. సినిమా టైటిల్ కార్డులో వచ్చే ఈ పాటకు అదితీ సాగర్ సాహిత్యం అందించాడు. ప్రస్తుతం ఈ పాట వైరల్‌గా మారింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలకపాత్రలో నటించాడు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.