కష్టానికి ఫలితం దక్కింది
“శేఖర్’ చిత్రాన్ని 300 థియేటర్లలో విడుదల చేశాం. ప్రతి కేంద్రం నుంచి మంచి స్పందన లభిస్తున్నది. సినిమాలోని సందేశం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నది’ అని అన్నారు చిత్ర నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి. రాజశేఖర్ ప్రధాన పాత్రలో జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘శేఖర్’ చిత్రం శుక్రవారం ప్రేక్షకులముందుకొచ్చింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ‘చిన్నప్పటి నుంచి నేను రాజశేఖర్గారి అభిమానిని. ‘గరుడవేగ’ చిత్రానికి ఆయనతో కలిసి పనిచేశా. మలయాళ ‘జోసెఫ్’ చిత్రం నచ్చడంతో తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాం. దర్శకత్వం కోసం జీవితగారు రైట్ ఛాయిస్ అనిపించింది. మా సినిమాకు మంచి ఆదరణ లభిస్తున్నది.
క్లెమాక్స్ సందేశాన్నిస్తూనే ఆలోచన రేకెత్తించేలా ఉందని అంటున్నారు. సినిమా విజయంతో మా కష్టానికి ఫలితం దక్కింది’ అన్నారు. బీరం పుల్లారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా తాను సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, ఏప్రిల్లో డాక్టరేట్ స్వీకరించానని బీరం సుధాకర్ రెడ్డి తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ‘Shekhar’
- Joseph
- Rajasekhar
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

