The Kashmir Files OTT | ‘ది కాశ్మీర్ ఫైల్స్’ ఓటీటీ విడుదల ఖరారు చేసిన మేకర్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
The Kashmir Files On OTT | కొన్ని సినిమాలు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంటాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతుంటాయి. అదే కొన్ని సినిమాలు తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కుతుంటాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ సునామీని సృష్టిస్తాయి. ఇందులో తేడా బడ్జెట్లో కాదు.. కంటెంట్‌లో. కంటెంట్ ఉంటే పేరున్న కథానాయకులు కూడా అవసరం లేదు అని ఇప్పటికే పలు సినిమాలు నిరూపించాయి. ఈ క్రమంలో ఇటీవలే ఈ లిస్ట్‌లోకి చేరిన చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్’. ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ వర్షం కురిపించింది. దాదాపు 25 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటివరకు 250కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి రికార్డు సృష్టించింది.
ఈ చిత్రాన్ని థియేటర్లో మిస్సయిన వారందరూ ఓటీటీ విడుదలకు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రం ఓటీటీలో హిందీతో పాటు తెలుగు, తమిళ,కన్నడ భాషల్లో విడుదలవుతుంది అని తెలియడంతో ఎప్పుడెప్పుడు డిజిటల్లో వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర బృందం ఓటీటీ విడుదలను ప్రకటించింది. 1990లో కాశ్మీర్ పండిట్లపై జరిగిన సామూహిక హత్యకాండ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి వివేక్ అగ్ని హోత్రీ దర్శకత్వం వహించాడు. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్‌కుమార్, పల్లవి జోషి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మించాడు.
हम देखेंगे #thekashmirfiles premiering 13th May on #zee5@mithunda_off @AnupamPKher @vivekagnihotri #PallaviJoshi @ImPuneetIssar @bhashasumbli @AtulShree62 @mrinal_kulkarni @abhishekofficl @ZeeStudios_ @i_ambuddha @ZeeMusicCompany @zeecinema @Zee5India @ZEE5India pic.twitter.com/OryDB9aWlk
— Darshan Kumaar (@DarshanKumaar) April 25, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

