The Kashmir Files | ఓటీటీ విడుదలకు సిద్ధమైన ‘ది కాశ్మీర్ ఫైల్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
The Kashmir Files On OTT | కొన్ని సినిమాలు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంటాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతుంటాయి. అదే కొన్ని సినిమాలు తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కుతుంటాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ సునామీని సృష్టిస్తాయి. ఇందులో తేడా బడ్జెట్లో కాదు.. కంటెంట్‌లో. కంటెంట్ ఉంటే పేరున్న కథానాయకులు కూడా అవసరం లేదు అని ఇప్పటికే పలు సినిమాలు నిరూపించాయి. ఈ క్రమంలో తాజాగా ఈ లిస్ట్‌లోకి చేరిన చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్’. ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ వర్షం కురిపించింది. దాదాపు 25 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటివరకు 250కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి రికార్డు సృష్టించింది. ఇక ఈ చిత్రం డిజిటల్ విడుదలకు సిద్ధమైంది.
కాశ్మీర్ పండిట్లపై జరిగిన సామూహిక హత్యకాండ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి వివేక్ అగ్నిహోత్రీ దర్శకత్వం వహించాడు. ఇక ఈ చిత్రం మే 13నుంచి ‘జీ-5’లో హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్‌కుమార్, పల్లవి జోషి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మించాడు. ఇక ప్రస్తుతం వివేక్ అగ్నిహోత్రీ, ఇదే నిర్మాతతో కలిసి ‘ది ఢిల్లీ ఫైల్స్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది ద్వితియార్థంలో షూటింగ్ ప్రారంభించనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

