మాసస్, విష్ణుప్రియ నర్తించిన ‘జరీ జరీ పంచె కట్టు’ జానపద గీతాన్ని నివ్రితి వైబ్స్ యూ ట్యూబ్ ఛానల్ ద్వారా గురువారం విడుదల చేశారు. సుద్దాల అశోక్‌తేజ రచించిన ఈ పాటకు మదిన్ సంగీత సారథ్యం వహించారు. శ్రావణ భార్గవి, సాకేత్, స్ఫూర్తి జితేందర్ ఆలపించారు. జ్యోతి, ప్రియ, ప్రశాంత్ నిర్మాతలు. ఈ సందర్భంగా మానస్ మాట్లాడుతూ ‘శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ పాట చేయడం ఆనందంగా ఉంది.
సుద్దాల అశోక్‌తేజ సాహిత్యం చాలా బాగుంది. ఈ పాట కోసం టాప్ టెక్నీషియన్స్ పనిచేయడం వల్ల అద్భుతంగా వచ్చింది. నివ్రితి వైబ్స్ ఛానల్ ఇలాంటి పాటలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నా’ అన్నారు. ఈ పాటలో మానస్ చేసిన స్టెప్పులు అదిరిపోయాలని సింగర్స్ ప్రశంసించారు.