శివకార్తికేయన్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘అయలాన్’. ఆర్.రవికుమార్ దర్శకుడు. కోటపాడి జె రాజేష్, ఆర్.డి.రాజా నిర్మిస్తున్నారు. ఏ.ఆర్.రెహమాన్ స్వరకర్త. తమిళంలో ‘అయలాన్’ అంటే ‘ఏలియన్’ అని అర్థం. దీపావళి కానుకగా పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదలకానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘దక్షిణాది భాషల్లో ఈ తరహా కథాంశంతో సినిమా రావడం ఇదే తొలిసారి. విజువల్ ఎఫెక్ట్స్ అబ్బురపరుస్తాయి. ఇందులో 4500పైగా వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉంటాయి.
ఇండియన్ సినిమా చరిత్రలో ఈ స్థాయిలో స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్న చిత్రమిదే. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటున్నాం. తప్పకుండా భారతీయ ప్రేక్షకులకు కొత్త అనుభూతినందించే చిత్రమవుతుంది’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నీరవ్‌షా, దర్శకత్వం: ఆర్.రవికుమార్.