Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
Breakeven Target | భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న నితీశ్ తివారీ చిత్రం 'రామాయణ' (Ramayana) బాక్సాఫీస్ వద్ద భారీ సవాల్‌ను ఎదుర్కొనబోతుంది.
Ramayana Breakeven Target | భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న నితీశ్ తివారీ చిత్రం ‘రామాయణ’ (Ramayana) బాక్సాఫీస్ వద్ద భారీ సవాల్‌ను ఎదుర్కొనబోతుంది. ఈ సినిమాకు ఏకంగా రూ. 2,000 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించంగా. సినిమా ఆర్థికంగా సక్సెస్ కావాలంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 5,000 కోట్లు రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 5న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్, ఓపెనింగ్స్, బాక్సాఫీస్ లెక్కలపై ట్రేడ్ ఎక్స్పర్ట్స్ పలు కీలక విషయాలు వెల్లడించారు.
ఈ సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించే అవకాశం ఉందని, అయితే రూ. 2,000 కోట్ల భారీ బడ్జెట్‌ను రికవరీ చేయడం మాత్రం అంత ఆశామాషీ కాదని విశ్లేషకులు చెబుతున్నారు. దేశీయంగా తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే రూ. 75 నుంచి రూ. 100 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 150 నుంచి రూ. 200 కోట్ల ప్రీ-సేల్స్ సాధిస్తేనే సినిమాకు బలమైన పునాది ఏర్పడుతుందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నారు. ముఖ్యంగా బాలీవుడ్ మార్కెట్‌తో పాటు సౌత్ ఇండియన్ మార్కెట్ల నుంచి కనీసం 35 నుంచి 40 శాతం వసూళ్లు వస్తేనే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమవుతుంది.
ఇక ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తుండగా, యశ్ రావణాసురుడిగా కనిపించనున్నారు. యశ్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ భారీ పాన్-ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రీవ్యూలు ప్రదర్శించనుండగా, నవంబర్ 5న సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. కేవలం థియేట్రికల్ కలెక్షన్లే కాకుండా శాటిలైట్, డిజిటల్ మరియు ఇతర హక్కుల ద్వారా కూడా భారీ రాబడి వస్తేనే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సురక్షితంగా బయటపడుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

