‘ఇవాళ చిన్నా, పెద్దా తేడా లేదు కేవలం మంచి చిత్రాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు’ అని అన్నారు హీరో అల్లు అర్జున్. ఆయన ‘అల్లూరి’ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కయాదు లోహర్ నాయికగా నటిస్తున్నది. లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు.
ప్రదీప్ వర్మ దర్శకుడు. ఈ నెల 23న సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. హీరో అల్లు అర్జున్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ…పాండమిక్ తర్వాత సినిమా స్వరూపం మారిపోయింది. ఇవాళ సినిమాలకు చిన్నా, పెద్దా తేడా లేదు. మంచి చిత్రాల టైవ్ు నడుస్తున్నది. అవే ఆదరణ పొందుతున్నాయి. శ్రీవిష్ణు నటుడిగా ఎప్పుడూ వినూత్న ప్రయత్నాలు చేస్తాడు. సినిమా కోసం కష్టపడతాడు. అతనంటే నాకు ప్రత్యేక అభిమానం. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలి. అన్నారు. హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ..గొప్ప పోలీసుల స్ఫూర్తితో చేసిన చిత్రమిది. ఈ సినిమా చూశాక పోలీస్ లకు సెల్యూట్ చేస్తారు అన్నారు.