స్వీయానుభవాలతో రాసుకున్న కథ
నవదీప్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘లవ్ మౌళి’. పంఖురి గిద్వానీ, భావన సాగి కథానాయికలు. అవనీంద్ర దర్శకుడు. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్, సీ స్పేస్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా టీజర్‌ను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘జీవితంలో మనం చాలా చేయాలనుకుంటాం. కానీ జరిగేది వేరు.
నవదీప్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘లవ్ మౌళి’. పంఖురి గిద్వానీ, భావన సాగి కథానాయికలు. అవనీంద్ర దర్శకుడు. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్, సీ స్పేస్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా టీజర్‌ను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘జీవితంలో మనం చాలా చేయాలనుకుంటాం. కానీ జరిగేది వేరు. అందుకు నా జీవితమే ఉదాహరణ. లాక్డౌన్ నేనేంటో నాకు చెప్పింది. ఆ టైమ్‌లోనే ఈ కథ విన్నాను. ఇదే నేను చేయాల్సిన సినిమా అనిపించింది. కచ్చితంగా నా కెరీర్లోనే బెస్ట్ సినిమా అవుతుంది’ అని నవదీప్ నమ్మకం వెలిబుచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ ‘నా జీవితంలో నేను చూసిన ప్రేమకథల ఫలితమే ఈ సినిమా. స్వీయ అనుభవాలతో ఈ కథ రాసుకున్నా’ అన్నారు. ప్రేమ గురించి నిజాయితీగా, బ్యూటిఫుల్‌గా చెప్పిన ప్రేమకథ ఇదని కథానాయిక పంఖురి గిద్వానీ పేర్కొన్నది. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు. మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం, కెమెరా, ఎడిటింగ్ : అవనీంద్ర, సంగీతం: గోవింద్ వసంత, పాటలు: అనంతశ్రీరామ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

