Deepika Padukone | ఆస్కార్ నుంచి దీపికా పదుకొణెకు అరుదైన గుర్తింపు.. ‘యే జవానీ హై దీవానీ’ సినిమాపై ప్రత్యేక పోస్ట్!
Yeh Jawaani Hai Deewani | బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొణె జంటగా నటించిన కల్ట్ హిట్ చిత్రం 'యే జవానీ హై దీవానీ' మరోసారి వార్తల్లో నిలిచింది.
Yeh Jawaani Hai Deewani | బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొణె జంటగా నటించిన కల్ట్ హిట్ చిత్రం ‘యే జవానీ హై దీవానీ’ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె పోషించిన ‘నైనా తల్వార్’ పాత్రకు ఆస్కార్ అవార్డులను అందించే ‘ది అకాడమీ’ నుంచి ప్రత్యేక గుర్తింపు లభించింది. అకాడమీ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ సినిమాలోని ఒక ప్రత్యేకమైన దృశ్యాన్ని పంచుకుంటూ మీ కళ్ల ముందే ఉన్న అందాన్ని ఆస్వాదించమని నైనా మనకు ఇస్తున్న చిన్న గుర్తు అంటూ క్యాప్షన్ జోడించింది.
ఉదయపూర్‌లో అదితి వివాహ వేడుకకు ముందు వచ్చే సూర్యాస్తమయ దృశ్యాన్ని అకాడమీ షేర్ చేసింది. ఈ సీన్లో ఎప్పుడూ లైఫ్‌లో పరిగెత్తే బన్నీతో (రణ్‌బీర్ కపూర్), క్షణాన్ని ఆస్వాదించాలని, ప్రతిదీ అనుభవించడం సాధ్యం కాదని, కొన్నిసార్లు ఉన్న చోటే సంతోషంగా గడపడం ముఖ్యమని నైనా వివరిస్తుంది. సినిమాలోని ఈ భావోద్వేగ సన్నివేశం ప్రేక్షకుల మనసులను ఎంతగానో హత్తుకుంది.
ఈ పోస్ట్ చూసిన అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. “ఈ సినిమా నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేకమే,” అని ఒక అభిమాని అనగా, మరొకరు “ఎన్ని సినిమాలు చూసినా, ‘యే జవానీ హై దీవానీ’ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. ఏడాదికిసారైనా ఈ సినిమా చూస్తాను, ఇది ఇంటికి వెళ్లిన అనుభూతిని ఇస్తుంది,” అని పేర్కొన్నారు. 2013లో విడుదలైన ఈ చిత్రానికి రణ్‌బీర్, దీపికాలతో పాటు ఆదిత్య రాయ్ కపూర్, కల్కి కోచ్లిన్ నటన, ప్రీతమ్ సంగీతం అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఇప్పటికీ ఈ సినిమాకు కోట్లాది మంది అభిమానులున్నారు.
A reminder from Naina to enjoy what’s right in front of you.
Film: YEH JAWAANI HAI DEEWANI (2013) pic.twitter.com/hETENoHevH
— The Academy (@TheAcademy) August 29, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

