అవన్నీ బోనస్ అనుకుంటా!

సినీరంగంలో తొలి అడుగు నుంచి కెరీర్‌ను ప్రణాళికబద్దంగా తీర్చిదిద్దుకున్నానని చెప్పింది మిల్కీబ్యూటీ తమన్నా. మన ఆశయాల్లో నిజాయితీ, స్వచ్ఛత ఉంటే కోరుకున్న గమ్యాన్ని చేరుకుంటామని విశ్వాసం వ్యక్తం చేసింది. పదిహేనేళ్ల సుదీర్ఘ కెరీర్లో దక్షిణాదిన కమర్షియల్ కథానాయికగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సృషించుకుంది తమన్నా. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లలో నటిస్తూ బిజీగా ఉంది. అగ్ర కథానాయికలు డిజిటల్ మీడియాపై అడుగుపెట్టేందుకు సంకోచిస్తున్న తరుణంలో తాను ధైర్యంగా వెబ్‌సిరీస్‌లు చేశానని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘డిజిటల్ వేదికలు నటిగా ప్రతిభాసామర్థ్యాల్ని ఆవిష్కరించుకోవడానికి గొప్ప మాధ్యమాలుగా భావిస్తా. ఇక్కడ కొత్త కథల్ని, ప్రయోగాత్మక ఇతివృత్తాల్ని ఎంచుకునే అవకాశముంటుంది. భవిష్యత్తులో మరిన్ని వినూత్న కాన్సెప్ట్‌లను ఎంచుకొని వెబ్‌సిరీస్‌లు చేస్తాను’ అని చెప్పింది. ఓటీటీల్లో నటించడం వల్ల కథానాయికగా స్టార్డమ్ దెబ్బతింటుంది కదా అనే ప్రశ్నకు…‘ నటించడం వరకే మన చేతిలో ఉంటుంది. స్టార్డమ్ ప్రేక్షకులు అందించే వరం. నా నియంత్రణలో లేని విషయాల గురించి ఎప్పుడూ ఆలోచించను. ప్రతిభకు గుర్తింపుతో పాటు స్టార్డమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తే వాటిని బోనస్‌గా భావిస్తా’ అని చెప్పింది. తెలుగులో ‘లెవెన్త్ అవర్’ సిరీస్‌తో ఓటీటీ వేదిక మీద అరంగేట్రం చేసింది తమన్నా. ఆమె నటించిన తొలి తమిళ వెబ్‌సిరీస్ ‘నవంబర్ స్టోరీ’ త్వరలో విడుదలకానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- 11th hour
- ott
- tamanna
- web series
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

