Thalapathy Vijay | షారుఖ్ ఖాన్ నా రోల్ మోడల్ : దళపతి విజయ్
ShahRukhKhan | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనకు రోల్ మోడల్ లాంటివారని తెలిపాడు తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత దళపతి విజయ్.
Thalapathy Vijay | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనకు రోల్ మోడల్ లాంటివారని తెలిపాడు తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత దళపతి విజయ్. చెన్నై వేదికగా జరిగిన ఒక ప్రత్యేక మీడియా సమావేశంలో విజయ్ మాట్లాడుతూ.. తన రాజకీయ ప్రస్థానంతో పాటు జననాయగన్ విడుదల వివాదం, తన రోల్ మోడల్ గురించి స్పందించాడు.
షారుఖ్ అంటే తనకి ఇష్టమని చెప్పిన విజయ్.. అతడిపై ప్రశంసల జల్లు కురిపించారు. షారుఖ్ ఖాన్ మాట్లాడే తీరు, ఆయన వ్యక్తిత్వం తనను ఎంతగానో ప్రభావితం చేశాయని, అందుకే ఆయన్ని తన రోల్ మోడల్‌గా భావిస్తానని స్పష్టం చేశారు. ఇక గతంలో ‘జవాన్’ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ఎంతటి సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే.
హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జన నాయగన్’ చిత్రం విజయ్ కెరీర్లో 69వ మరియు చివరి చిత్రం కావడం విశేషం. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, ప్రకాష్ రాజ్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. ఈ సినిమా 2023 నాటి తెలుగు హిట్ చిత్రం ‘భగవంత్ కేసరి’కి రీమేక్. ఇందులో విజయ్ ‘దళపతి వెట్రి కొండన్’ అనే శక్తివంతమైన ఐపీఎస్ అధికారి పాత్రలో కనిపిస్తారని సమాచారం. రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో వెళ్లే ముందు వస్తున్న ఈ చివరి చిత్రం కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

