Thalaivi: తలైవి రిలీజ్ థియేటర్స్‌లోనే.. ఎప్పుడు విడుదలో తెలుసా?

మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం తలైవి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. థియేటర్స్లోవిడుదల అవుతుందా, ఓటీటీలో విడుదల అవుతుందా అనే అనుమానం అభిమానులలో ఉండగా, దానిపై క్లారిటీ ఇచ్చింది చిత్ర బృందం.
కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తలైవి చిత్రంలో అరవింద స్వామి ఎంజీఆర్ పాత్రలో కనిపించనున్నారు.ఈ చిత్రానికి ఏ.ఎల్ విజయ్ డైరెక్షన్ వహిస్తున్నారు. గత సంవత్సరం విడుదల కావాల్సిన ఈ సినిమా.. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు సినిమా విడుదల తేదీని ప్రకటించారు. సెప్టెంబర్ 10న తలైవి థియేటర్లో రానున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
‘ఐకానిక్ వ్యక్తి కథని పెద్ద తెరపైనే చూడాలి. తలైవి కోసం, ఆమె సినిమా ప్రపంచంలోకి సూపర్‌స్టార్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నందున, ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 10న విడుదల చేయబోతున్నాం’ అంటూ నిర్మాణ సంస్థ విడుదల తేదీని ప్రకటించారు. దేశవ్యాప్తంగా థియేటర్లు తిరిగి తెరుస్తున్నందున అభిమానులు వెండి తెరపై లెజెండ్ జయలలిత జీవితం లోని గొప్ప అనుభూతిని ఆస్వాధించగలరని సంతోషిస్తున్నాము అని నిర్మాత విష్ణు వర్ధన్ ఇందూరి స్పస్టం చేశారు. ఈ చిత్రంలో ఎంజీఆర్ భార్యగా మధుబాల నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఈ మూవీని విడుదల చేయనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

