విప్లవ నాయకి ప్రస్థానం

విప్లవ నాయకిగా తమిళ ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘తలైవి’. కంగనారనౌత్ టైటిల్ రోల్‌ని పోషిస్తోంది. ఏ.ఎల్.విజయ్ దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమాలోని కొత్త పోస్టర్స్‌ను గురువారం విడుదల చేశారు. సినీ నటిగా ప్రస్థానాన్ని ఆరంభించిన జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎదిగిన వైనాన్ని..ఆమె జీవితంలోని ముఖ్యఘట్టాల్ని, సంఘర్షణను ఆవిష్కరిస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. జయలలిత జీవితంలోని నాలుగు కీలక దశల్ని ఈ సినిమాలో ఆవిష్కరించారు. గతంలో విడుదలైన చిత్ర పోస్టర్స్ అందరిని ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో ఎంజీఆర్‌గా అరవింద్‌స్వామి నటించారు. ఏప్రిల్ 23న విడుదలకావల్సిన ఈ చిత్రాన్ని కరోనా సెకండ్‌వేవ్ కారణంగా వాయిదా వేశారు. ఆగస్ట్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

