Thalaivar 173 | సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘తలైవర్ 173’ టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ‘ధర్మన్’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. “ధర్మం వర్ధిల్లుతుంది” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా రానుండటం విశేషం. ఈ సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయగా.. ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే.. ఈ సినిమాలో రజనీ డాక్టర్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది.
ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మిస్తుండగా.. ‘ఓ మై కడవులే’, ‘డ్రాగన్’ వంటి వరుస హిట్లతో దూసుకుపోతున్న యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, అన్బరివ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. రజినీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్లో ఈ సినిమా రాబోతుండటం కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. రెండు లెజెండ్స్ కలిసి పనిచేస్తుండటంతో అటు రజినీ ఫ్యాన్స్, ఇటు కమల్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టైటిల్ అనౌన్స్మెంట్తోనే సోషల్ మీడియాలో ‘ధర్మన్’ ట్రెండ్ అవుతోంది. త్వరలోనే షూటింగ్ మొదలుకానుండగా, నటీనటుల వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.
தர்மமே வெல்லும்!#Dharman #Thalaivar173 #SuperstarRajinikanth @rajinikanth #Mahendran @Dir_Ashwath @anirudhofficial @anbariv @RKFI @turmericmediaTM @magizhmandram pic.twitter.com/9ghF9XgboI
— Kamal Haasan (@ikamalhaasan) June 24, 2026