స్వామీజీల మోసాల్ని చూపించాం!
‘ప్రతీకార నేపథ్య కథాంశంతో ‘తగ్గేదేలే’ చిత్రాన్ని తెరకెక్కించాం. సినిమాలోని పాత్రలు కూడా తగ్గేదేలే అనే తరహాలో ఉంటాయి. టైటిల్‌కు మంచి స్పందన లభిస్తున్నది’
‘ప్రతీకార నేపథ్య కథాంశంతో ‘తగ్గేదేలే’ చిత్రాన్ని తెరకెక్కించాం. సినిమాలోని పాత్రలు కూడా తగ్గేదేలే అనే తరహాలో ఉంటాయి. టైటిల్‌కు మంచి స్పందన లభిస్తున్నది’ అన్నారు శ్రీనివాసరాజు. ఆయన దర్శకత్వంలో నవీన్‌చంద్ర కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాసరాజు పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ప్రేమ నేపథ్యంలో నడిచే ప్రతీకార కథ ఇది. ఇదివరకు తెలిసిన కథనే కొత్తగా చెప్పాం. ప్రస్తుతం ఆధ్యాత్మికం అనేది వ్యాపారంగా మారిపోయింది. మనుషుల నమ్మకాల్ని స్వామిజీలు సొమ్ము చేసుకుంటున్నారు. వారి మోసాల్ని ఈ సినిమాలో చూపించాం. సమకాలీన సంఘటనల్ని చర్చిస్తూ సందేశాత్మకంగా సాగుతుంది. ‘దండుపాళ్యం’ తర్వాత నేను చాలా మంది హీరోల్ని కలిసి కథలు చెప్పాను. కానీ ఎక్కడా వర్కవుట్ కాలేదు. చివరకు ఈ సినిమా ఛాన్స్ వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ కథగా ‘తగ్గేదేలే’ మెప్పిస్తుంది. ప్రస్తుతం హీరోలకు ఉండే డెమీగాడ్ ఇమేజ్ తగ్గిపోతున్నది. ప్రేక్షకుల ఊహలకు భిన్నంగా ఉన్న కథాంశాలే ఆదరణ పొందుతున్నాయి. అందుకు ఇటీవల వచ్చిన ‘కాంతార’ చిత్రమే మంచి ఉదాహరణ’ అని చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

