Sudarshan Theatre | ప్రభాస్ అభిమానిపై దాడి.. సుదర్శన్ థియేటర్ వద్ద ఉద్రిక్తత.. అసలేం జరిగింది?
Prabhas | హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Darling Re Release | హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ‘రెబల్ స్టార్’ ప్రభాస్ నటించిన ‘డార్లింగ్’ సినిమా విడుదలై 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 4K వెర్షన్లో గ్రాండ్ గా రీ రిలీజ్ చేయగా.. ఈ వేడుకలతో థియేటర్ ప్రాంగణం ఒక్కసారిగా రణరంగంగా మారింది.
ఈ ఘటనలో థియేటర్ యాజమాన్యం ఒక అభిమానిపై దాడికి పాల్పడటం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ గొడవకు సంబంధించి రెండు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. సినిమాలోని కొన్ని పాటలను మేనేజ్మెంట్ కట్ చేయడంతో, దానిని ప్రశ్నించినందుకు తమపై సిబ్బంది చేయి చేసుకున్నారని అభిమానులు ఆరోపిస్తుండగా.. మరోవైపు, సదరు వ్యక్తి మద్యం మత్తులో అక్కడి మహిళా సిబ్బందిపై అసభ్యకరంగా ప్రవర్తించాడని, మిడిల్ ఫింగర్ చూపిస్తూ దుర్భాషలాడటం వల్లే తాము స్పందించాల్సి వచ్చిందని థియేటర్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం బాధితురాలికి యాజమాన్యం చికిత్స అందిస్తూనే, నిందితుడిపై కఠిన చర్యలకు డిమాండ్ చేస్తోంది. ఇక భారీ రెస్పాన్స్‌తో హౌస్‌ఫుల్ షోలతో సాగుతున్న ఈ వేడుకల్లో ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగడం పట్ల అటు అభిమానులు, ఇటు సినిమా వర్గాలు విచారం వ్యక్తం చేస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
What happened at #Sudarshan?
A person who came to watch #Darling4K at Sudarshan Theatre reportedly misbehaved with the staff, and in response, the staff allegedly attacked him. pic.twitter.com/tCdaYon40o
— Movies4u Official (@Movies4u_Officl) April 23, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

