మలయాళంలో విజయవంతమైన ‘నాయాట్టు’ చిత్రం తెలుగులో ‘కోట బొమ్మాళి’ పేరుతో రీమేక్ అవుతున్నది. శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తేజ మార్ని దర్శకుడు. బన్నీ వాసు, విద్య కొప్పినీడి నిర్మాతలు. ఈ సినిమాలోని శ్రీకాకుళం జానపద శైలిలో సాగిన ‘లింగి లింగి లింగిడి’ అనే తొలి గీతాన్ని సోమవారం విడుదల చేశారు. రేలారే ఫేమ్ పి.రఘు సాహిత్యాన్ని అందించడంతో పాటు ఆలపించారు. రాహుల్ విజయ్, శివాని నృత్యం ఈ పాటకు ప్రధానాకర్షణగా నిలిచింది.