Chandramohan: కట్టు కథలు చెప్పి నేను కవ్విస్తే… అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ.. చంద్రమోహన్ పేరు చెప్పగానే గుర్తొచ్చే పాటలు కొన్ని!
Chandramohan: సిరి సిరి మువ్వ.. పదహారేళ్ల వయసు చిత్రాలు.. హీరో చంద్రమోహన్ కెరీర్లో ప్రత్యేకమైనవి. ఆ ఫిల్మ్స్ అప్పట్లో బ్లాక్‌బస్టర్ మూవీస్. ఇక రెండు సినిమాల్లో ఉన్న సాంగ్స్ కూడా ఆ రోజుల్లో ట్రెండ్ సెట్ చేశాయి. ఫిల్మ్ లవర్స్‌ను విశేషంగా సాంగ్స్ ఆకట్టుకున్నాయి. చంద్రమోహన్ నటించిన ఆ సాంగ్స్ వీడియోలు చూడండి.
హైదరాబాద్: పదహారేళ్ల వయసు.. సిరి సిరి మువ్వ లాంటి చిత్రాలో చంద్రమోహన్ తన నటనతో ఆకట్టుకున్నాడు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తనదైన స్టయిలో హావభావాలతో ఓ తరం ప్రేక్షకులను థ్రిల్ చేశాడు. 1978లో రిలీజైన పదహారేళ్ల వయసు చిత్రం అప్పట్లో ఓ కొత్త ట్రెండ్ సెట్ చేసింది. శ్రీదేవి, మోహన్‌బాబుతో కలిసి చంద్రమోహన్ నటించారు. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ఆ ఫిల్మ్ ను సినీ ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. చక్రవర్తి అందించిన మ్యూజిక్ ఓ పెద్ద హిట్.
కట్టు కథలు చెప్పి నేను కవ్విస్తే, నవ్విస్తే.. బంగారు బాలపిచ్చుక నవ్వాలి పకాపకా.. మళ్లీ మళ్లీ నవ్వాలి పకాపకా అంటూ సాగే సాంగ్‌లో చంద్రమోహన్ తన ట్యాలెంట్ చూపించారు. కుంటివాడి పాత్రలో హీరో చంద్రమోహన్ ఆ ఫిల్మ్‌లో నటించాడు. ఆనాటి ఫిల్మ్ లవర్స్‌ను ఈ సాంగ్ తెగ ఇంప్రెస్ చేసింది. ఆ సాంగ్ వీడియో చూడిండి.
అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ.. అందరికీ అందనిది ఈ పూచన కొమ్మ సాంగ్ కూడా చంద్రమోహన్ కెరీర్లో ప్రత్యేకమైంది. సిరి సిరి మువ్వ ఫిల్మ్‌లో జయపద్రతో చంద్రమోహన్ కీలకపాత్రలో నటించాడు. పలకామన్న పలకదు ఈ పంచధార చిలక అంటూ చంద్రమోహన్ ఆ పాటలో పాత్రలోని భావాలను అద్భుతంగా ప్రదర్శించాడు. కే విశ్వనాథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ ఫిల్మ్‌లో మహాదేవన్ తన మ్యూజిక్‌తో అట్రాక్ట్ చేశాడు. చంద్రమోహన్ నటనకు మరో మచ్చుతునకగా మారిన సిరిసిరి మువ్వ చిత్రంలో సాంగ్‌ను చూడండి.
సిరి సిరి మువ్వ చిత్రంలో జమ్ముంది నాదం సాంగ్.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఎవర్గ్రీన్ సాంగ్‌గా నిలుస్తుంది. ఆ పాట అప్పట్లో అందరిలో ఫుల్ జోష్ తెప్పించింది. హై రేంజ్లో సాగే ఈ సాంగ్ ఎంతో మంది కళాకారులకు ఇన్స్పిరేషన్గా నిలిచింది. ఆ పాటను కూడా వీక్షించండి.
తెలుగు సినీ ప్రేక్షకులకు చంద్రమోహన్ ఇవాళ దూరం అయ్యారు. ఎన్నో దశాబ్ధాలు తన విలక్షణ నటనతో తెలుగువారి మనసుదోచిన ఆ నటుడు ఇవాళ తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో కాసేపటి క్రితమే ఆయన మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

