Super Star Krishna | సూపర్ స్టార్ కృష్ణ (80) మంగళవారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కృష్ణ మరణం తెలుగు సినీ చిత్ర పరిశ్రమనే కాకుండా ఘట్టమనేని కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈ నేపథ్యంలో ఆయన మృతికి సంతాప సూచికంగా తెలుగు సినీ పరిశ్రమ బుధవారం బంద్ పాటించనుంది. ఈ మేరకు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రకటన విడుదల చేసింది.