Raj Dasireddy | న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ 2026లో మెరిసిన తెలుగు హీరో రాజ్ దాసిరెడ్డి!
అమెరికా వేదికగా జరిగిన న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ 2026లో తెలుగు మూలాలున్న యువ హీరో రాజ్ దాసిరెడ్డి తన ప్రత్యేక హైప్రొఫైల్ ప్రదర్శనతో అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు.
అమెరికా వేదికగా జరిగిన న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ 2026లో తెలుగు మూలాలున్న యువ హీరో రాజ్ దాసిరెడ్డి తన ప్రత్యేక హైప్రొఫైల్ ప్రదర్శనతో అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు. కలలు, పట్టుదల, భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఆయన, ఈ ఫ్యాషన్ వేదికపై తన స్టైలిష్ లుక్స్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గతంలో 2025లో ప్రతిష్టాత్మకమైన 97వ ఆస్కార్ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం అందుకుని అంతర్జాతీయ మీడియా ప్రశంసలు పొందిన రాజ్ దాసిరెడ్డి, ఇప్పుడు ఈ ఫ్యాషన్ ఈవెంట్‌తో మరోసారి టాలీవుడ్‌లోనూ, గ్లోబల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారారు. తెలుగు నేల నుంచి అంతర్జాతీయ వేదికల వరకు సాగుతున్న ఆయన ఈ విజయవంతమైన ప్రయాణం ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ విశేష చర్చకు దారితీస్తోంది.
అమెరికాలలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న రాజ్ దాసిరెడ్డి, అక్కడే ఫిల్మ్ మేకింగ్‌లో ప్రత్యేక శిక్షణ పొందారు. ఆ తర్వాత మోడలింగ్ రంగంలో రాణించి, అనంతరం నటనపై ఉన్న ఆసక్తితో సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన “భద్రం బీకేర్ ఫుల్ బ్రదరు” చిత్రంతో ఆయన టాలీవుడ్లో హీరోగా అరంగేట్రం చేశారు. తన తొలి సినిమాతోనే మంచి నటనను కనబరిచి ప్రేక్షకుల మన్ననలను పొందారు.
ప్రస్తుతం రాజ్ దాసిరెడ్డి మరో కొత్త బహుభాషా చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా డిఫరెంట్ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో తన సినీ కెరీర్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆయన ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అధికారిక వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే వెల్లడించనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

