దయచేసి థియేటర్స్ తెరిచే వరకు ఆగండి : తెలంగాణా స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ విన్నపం
తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. 2021 జూలై 3 నుంచి అక్టోబర్ 30 2021లోపు ఏ తెలుగు నిర్మాత కూడా తన సినిమా డిజిటల్ రైట్స్ OTTలకి అమ్మవద్దని కోరారు

OTT | కరోనా కారణంగా కొన్ని నెలలుగా సినిమా ఇండస్ట్రీ అత్యంత దారుణంగా నష్టపోతుంది. కేవలం తెలుగు ఇండస్ట్రీ మాత్రమే గత ఏడాదిన్నర కాలంగా 4000 కోట్ల రూపాయలు నష్టపోయినట్లు తెలుస్తుంది. మరోవైపు థియేటర్స్ ( Theatres ) వ్యవస్థ కూడా పూర్తిగా నాశనం అయిపోయింది. మరీ ముఖ్యంగా సెకండ్ వేవ్‌లో లాక్డౌన్ కారణంగా ఎన్నో థియేటర్స్ తాత్కాలికంగా మూసేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. 2021 జూలై 3 నుంచి అక్టోబర్ 30 2021లోపు ఏ తెలుగు నిర్మాత కూడా తన సినిమా డిజిటల్ రైట్స్ OTTలకి అమ్మవద్దని కోరారు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు. ఈ మేరకు సెక్రటరీ సునీల్ నారంగ్ ఓ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. వీలైనంత త్వరగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఓపెన్ చేస్తారని.. అందుకే త్వరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని నిర్మాతలను కోరారు.
జూలై అయిపోయిన తర్వాత ఆగస్టులో థియేటర్స్ తెరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే నిర్మాతలు తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేయకుండా OTTలో స్ట్రీమింగ్ చేయడం వైపు అడుగులు వేస్తున్నారు. ఇలా చేస్తే థియేటర్ వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని వాళ్లు బాధ పడుతున్నారు. థియేటర్ యాజమాన్యం కూడా ఇదే విషయంపై నిర్మాతలను విన్నవించుకుంటుంది. మరోవైపు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కూడా ఇదే అభిప్రాయపడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని థియేటర్ యజమానుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే తమ విజ్ఞప్తిని ఖాతరు చేయని నిర్మాతల పట్ల భవిష్యత్తులో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది తెలంగాణా ఫిల్మ్ చాంబర్. మరి దీనిపై నిర్మాతలు ఏమంటారో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
అమీర్‌ఖాన్ దంపతుల 15 ఏండ్ల వివాహ బంధానికి తెర
ముఖ్యమంత్రి కొడుకుతో ఆగిపోయిన మెహ్రీన్ పెళ్లి
మెహ్రీన్ కౌర్ కంటే ముందు నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్న సినీ ప్రముఖులు వీళ్లే
కాజల్ గర్భవతా, ఇందులో నిజమెంత?
చిన్మయి గర్భవతి అంటూ ప్రచారం..క్లారిటీ ఇచ్చిన ఫేమస్ సింగర్
ప్రగ్యాని రౌండప్ చేసిన బిచ్చగాళ్లు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

