‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఉత్తమ పాట విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కడంపై తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అభినందనలు తెలిపింది. మంగళవారం విడుదల చేసిన ప్రెస్నోట్లో అసోసియేషన్ స్పందిస్తూ…‘తెలుగు సినిమా పాటకు ఆస్కార్ అవార్డ్ దక్కినందుకు గర్వపడుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకు ఎల్లప్పుడూ అండగా ఉంటున్నది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందానికి సన్మానం చేస్తామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎఫ్డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం చెప్పడం సంతోషకరం’ అని పేర్కొంది.