Tejaswini | బాలయ్య కూతురిలో దాగి ఉన్న టాలెంట్.. డ్యాన్స్ వీడియోతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తేజస్విని!
Tejaswini | నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. ఒకప్పుడు మీడియా, సోషల్ మీడియాకు దూరంగా ఉండే ఆమె.. ఇప్పుడు తన ప్రతిభను ఒక్కొక్కటిగా అభిమానులకు పరిచయం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
Tejaswini | నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. ఒకప్పుడు మీడియా, సోషల్ మీడియాకు దూరంగా ఉండే ఆమె.. ఇప్పుడు తన ప్రతిభను ఒక్కొక్కటిగా అభిమానులకు పరిచయం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సినీ పరిశ్రమలో నిర్మాతగా, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తేజస్విని, బాలకృష్ణ హోస్ట్‌గా చేసిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే కార్యక్రమానికి కూడా కీలకంగా పనిచేశారు. షో విజయవంతం కావడంలో ఆమె పాత్ర కూడా ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతుంటాయి.
కొద్ది రోజుల క్రితం ఒక ప్రముఖ జ్యువెలరీ ప్రకటనలో నటించి తేజస్విని అందరినీ ఆశ్చర్యపరిచారు. కెమెరా ముందు ఎంతో సహజంగా నటించి ప్రశంసలు అందుకున్నారు. నందమూరి కుటుంబ వారసత్వం కారణంగా నటన ఆమెకు సహజంగానే వచ్చిందని అభిమానులు కామెంట్లు చేశారు. అప్పటి నుంచే ఆమె సినీ రంగంలో నటిగా ఎంట్రీ ఇవ్వొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా తేజస్విని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ డ్యాన్స్ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఓ వ్యక్తితో కలిసి చేసిన ఈ డ్యాన్స్ ప్రదర్శనలో ఆమె స్టెప్పులు, ఎనర్జీ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇంత మంచి డ్యాన్స్ టాలెంట్ కూడా ఉందా అంటూ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
వీడియో కింద అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. “ఇంత టాలెంట్ ఉండి ఇన్నాళ్లు ఎందుకు దాచిపెట్టారు?”, “సినిమాల్లోకి వస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు”, “నందమూరి కుటుంబం నుంచి మరో స్టార్ సిద్ధమవుతోంది” అంటూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మొన్న నటనతో, ఇప్పుడు డ్యాన్స్‌తో ఆకట్టుకున్న తేజస్విని.. తనలోని విభిన్న ప్రతిభలను బయటపెడుతూ అభిమానులను మెప్పిస్తున్నారు. ఈ క్రమంలో భవిష్యత్తులో ఆమె వెండితెరపై కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆమె డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది.
View this post on Instagram
A post shared by Tejeswini Nandamuri Mathukumilli (@tejeswinimathukumilli)
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

