Tejaswini | నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె, విశాఖపట్నం టీడీపీ ఎంపీ శ్రీభరత్ సతీమణి నందమూరి తేజస్విని మరోసారి తన డ్యాన్స్ టాలెంట్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ, అప్పుడప్పుడు తన డ్యాన్స్ వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంటూ వస్తున్న ఆమె, తాజాగా చేసిన ఓ పెర్ఫార్మెన్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవల ప్రముఖ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్‌తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోతో వార్తల్లో నిలిచిన తేజస్విని, ఇప్పుడు మరోసారి తన స్టెప్పులతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈసారి నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమాలోని సూపర్ హిట్ ఫోక్ సాంగ్ సారంగ దరియా కు ఆమె చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతోంది.
ఈ పాటలో సాయి పల్లవి చూపించిన ఎనర్జీ, గ్రేస్, ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అలాంటి పాటకు డ్యాన్స్ చేయడం అంత ఈజీ కాదు. కానీ తేజస్విని మాత్రం ఏమాత్రం వెనుకాడకుండా, ఒక ప్రొఫెషనల్ డ్యాన్సర్‌ను తలపించేలా స్టెప్పులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. పాటకు తగ్గట్టుగా ఆమె చూపించిన హావభావాలు, టైమింగ్, బాడీ లాంగ్వేజ్ వీడియోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డ్యాన్స్‌పై తనకున్న ప్యాషన్‌ను మరోసారి నిరూపించిన తేజస్విని పెర్ఫార్మెన్స్కు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. బాలయ్య కుమార్తె అంటే ఈ స్థాయి ఎనర్జీ ఉండాల్సిందే , తండ్రిలాగే కూతురిలో కూడా అద్భుతమైన గ్రేస్ ఉంది , సాయి పల్లవి స్టెప్పులను ఎంతో కాన్ఫిడెంట్‌గా రీక్రియేట్ చేశారు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఇక నందమూరి అభిమానులు కూడా ఈ వీడియోను భారీగా షేర్ చేస్తూ తేజస్వినిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, ఆమె డ్యాన్స్ స్కిల్స్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదని, అవకాశం వస్తే మంచి డ్యాన్సర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకునే స్థాయి టాలెంట్ ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం నందమూరి తేజస్విని ‘సారంగ దరియా’ డ్యాన్స్ వీడియో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికల్లో వైరల్‌గా మారింది. ఆమె ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ను చూసిన నెటిజన్లు మరోసారి ఫిదా అవుతూ వీడియోను విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
Balayya Daughter Tejaswini Dance Video 💃#NandamuriTejaswini pic.twitter.com/tCkTtKISB4
— Praneeth (@praneethballa) July 12, 2026