వంద కోట్లు దోచేదెవరు?

రాహుల్టైసన్, చేతన్, ఏమీ, ఐశ్వర్య నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘100 క్రోర్స్’. విరాట్ చక్రవర్తి దర్శకుడు. సాయికార్తిక్, నాగం తిరుపతిరెడ్డి నిర్మాతలు. ఈ చిత్ర టీజర్‌ను ఆదివారం దర్శకుడు అనిల్‌రావిపూడి విడుదలచేశారు. నోట్ల రద్దు నేపథ్యంలో మొదలైన టీజర్ ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. దర్శకుడు మాట్లాడుతూ ‘బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న వంద కోట్ల డబ్బును దోచుకోవడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు? వారెవరు? ఆ దొంగతనాన్ని పోలీసులు అడ్డుకోగలిగారా?లేదా? అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్, రొమాన్స్ సమ్మిళితంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. నిర్మాణానంతర కార్యక్రమాల్ని పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది’ అని తెలిపారు. సంగీత దర్శకుడు సాయికార్తిక్ ఈ సినిమాతో నిర్మాతగా అరంగేట్రం చేయనున్నారు. సాక్షిచౌదరి, ఐశ్వర్య, సమీర్, భద్రం ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, సంగీతం: సాయికార్తిక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

