దుష్టశిక్షణలో శివం భజే
అశ్విన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘శివం భజే’. అప్సర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. బుధవారం టీజర్‌ను విడుదల చేశారు.
అశ్విన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘శివం భజే’. అప్సర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. బుధవారం టీజర్‌ను విడుదల చేశారు. హీరో అశ్విన్ ఏదో మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు చూపించే సన్నివేశాలతో మొదలైన టీజర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. కొన్ని అనూహ్య సంఘటనల వెనక దైవం ఉందని తెలియజేయడం, హీరో రౌద్ర రూపాన్ని ధరించి రౌడీలను అంతం చేయడం, చివరగా శివుడి దర్శనంతో టీజర్‌ను ఆసక్తికరంగా ముగించారు. యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలు కలబోసిన డివోషనల్ మూవీ ఇదని, గ్రాఫిక్స్ ప్రధానాకర్షణగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో ఈ సినిమాను తెరకెక్కించామని, ప్రేక్షకులకు సరికొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ అందిస్తుందని, జూలైలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి తెలిపారు. సస్పెన్స్, థ్రిల్లర్, యాక్షన్, కామెడీ అంశాలు కలబోసిన పర్ఫెక్ట్ మూవీ ఇదని హీరో అశ్విన్ బాబు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: వికాస్ బడిస, ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్, దర్శకత్వం: అప్సర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

