Writer Padmabhushan Movie | ఓటీటీలోనే కాదు థియేటర్లోనూ విజయపరంపర కొనసాగించాడు యంగ్ హీరో సుహాస్. తాజాగా ఆయన నటించిన సినిమా ‘రైటర్ పద్మభూషణ్’ రిలీజై సంచలనం విజయం సాధించింది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ప్రాఫిట్ జోన్లోకి వెళ్లింది. పోటీగా మైఖేల్, బుట్టబొమ్మ వంటి సినిమాలున్నా.. ఫ్యామిలీ ఆడియోన్స్ రైటర్‌కే ఓటెస్తున్నారు. రైటర్ ఇంతపెద్ద విజయం సాధించిన సందర్భంగా చిత్రబృందం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
మహిళల కోసం రేపు ఈ సినిమాను ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని 38 థియేటర్లలో నాలుగు షోలలో మహిళలు ఉచితంగా సినిమాను చూడొచ్చు. అయితే ఆ థియేటర్ల లిస్ట్ ఇంకా బయటకు రాలేదు. చిత్రబృందం ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు రైటర్ సినిమా దాదాపు రూ.6 కోట్లకు పైగా గ్రాస్‌ను సాధించింది. కంటెంట్ ఉంటే ప్రేక్షకులు సినిమాలను ఎంతైనా ఆదరిస్తారని మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులు ప్రూవ్ చేశారు. ఇక్కడే అనుకుంటే ఓవర్సీస్లోనూ ఈ సినిమా విజయఢంకా మోగిస్తుంది. ఓవర్సీస్లో దాదాపు 2లక్షల డాలర్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి.