పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తరుణ్‌భాస్కర్ స్వీయదర్శకత్వంలో నటించిన చిత్రం ‘కీడా కోలా’. కె.వివేక్ సుధాంశు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్రవర్మ నిర్మాతలు. దగ్గుబాటి రానా సమర్పిస్తున్న ఈ చిత్రం నవంబర్ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా బ్రహ్మానందం, తరుణ్‌భాస్కర్, చైతన్యరావు ప్రధాన తారాగణమంతా సీరియస్ లుక్స్‌లో ఉన్న రిలీజ్ డేట్ పోస్టర్ని విడుదల చేశారు.
రెండున్నరగంటలపాటు నాన్‌స్టాప్‌గా ఎంటర్టైన్ చేసే సినిమా ఇదని దర్శక,నిర్మాతలు చెప్పారు. రఘురామ్, రవీంద్ర విజయ్, జీవన్‌కుమార్, విష్ణు, రాగ్ మయూర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఏజే ఆరోన్, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాణం: వి.జి.సైన్మ.