Tiger 3 | సల్మాన్ ఖాన్ టైగర్ 3 రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఎప్పుడంటే..?
Tiger 3 | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) టైగర్ ప్రాంఛైజీలో నటిస్తున్న తాజా చిత్రం టైగర్ 3 (Tiger 3). మనీశ్ శర్మ దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ భామ కత్రినాకైఫ్ హీరోయిన్గా నటిస్తోంది. షారుఖ్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Tiger 3 | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) టైగర్ ప్రాంఛైజీలో నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సెట్ చేశాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదే జోనర్లో వస్తున్న తాజా చిత్రం టైగర్ 3 (Tiger 3). మనీశ్ శర్మ దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ భామ కత్రినాకైఫ్ హీరోయిన్గా నటిస్తోంది. షారుఖ్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్టు ఇప్పటివరకున్న అప్డేట్.
అయితే మేకర్స్ విడుదల తేదీ ఎప్పుడనేది మాత్రం సస్పెన్స్‌లో పెడుతూ వస్తున్నారు. కాగా టైగర్ 3 విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ ఇవ్వబోతున్నారు.. వెయిట్ చేయండి.. అని ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. పులి గాయపడింది.. అని ట్వీట్‌తో కొన్ని రోజుల క్రితం టైగర్ 3 అప్డేట్ అందించి అభిమానులను ఖుషీ చేశాడు సల్లూభాయ్. దేశభక్తి ప్రధాన ఇతివృత్తంతో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌ను హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల చేసేందుకు యశ్ రాజ్ ఫిలిం ప్లాన్ చేస్తోంది.
ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తుండగా.. అశుతోష్ రాణా, అనుప్రియా గోయెంకా, రిద్ధి డోగ్రా, అంగద్ బేడి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలనాటి అందాల తార రేవతి (Revathi) చాలా కాలం తర్వాత మరోసారి స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో కలిసి సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. టైగర్ ప్రాంఛైజీలో ఏక్తా టైగర్, టైగర్ జిందా హై తర్వాత వస్తున్న సినిమా కావడంతో టైగర్ 3పై అంచనాలు భారీగా ఉన్నాయి.
‘TIGER 3’ RELEASE DATE: WAIT-N-WATCH… I’m in the know that #YRF has still not locked the *release date* of #Tiger3… Yes, it is arriving on #Diwali2023, the makers will announce the date soon… Everything else till then is pure speculation… Watch this space for official… pic.twitter.com/3kOsGGm11l
— taran adarsh (@taran_adarsh) October 2, 2023
As Per Sources: #SalmanKhan has wrapped filming for #Tiger3.
Now Post-Production is under way.
Releasing this Diwali 🪔.
Retweet 🔁 if You Are Hyped for 𝗧𝗶𝗴𝗲𝗿𝟯#YRFSpyUniverse | #ShahRukhKhan𓀠 | #Pathaan | #TigerVsPathaan | #YRF pic.twitter.com/XWgmVNV2Ai
— Rajat R Lunkad (@rajatlunkad) May 26, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

