Taraka Ratna | తారకరత్న ఎన్బీకే 108లో నటించాల్సింది.. కానీ అంతలోనే..
తారకరత్న (Taraka Ratna) లేడన్న విషయాన్ని కుటుంబసభ్యులతోపాటు చాలా మంది అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా బాబాయి బాలకృష్ణతో తారకరత్న ఓ సినిమా చేయాల్సి ఉండగా.. ఇలా ఆకస్మిక మరణంతో అది కార్యరూపం దాల్చలేదు.
నందమూరి తారకరత్న (Taraka Ratna) మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తారకరత్న లేడన్న విషయాన్ని కుటుంబసభ్యులతోపాటు చాలా మంది అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా బాబాయి బాలకృష్ణతో తారకరత్న ఓ సినిమా చేయాల్సి ఉండగా.. ఇలా ఆకస్మిక మరణంతో అది కార్యరూపం దాల్చలేదు. ఇదే నెలలో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్న ఎన్బీకే 108 (NBK 108)లో తారకరత్న నటించాల్సింది.
ఎన్బీకే 108లో తారకరత్నకు ఓ పాత్ర ఇవ్వాలని బాలయ్య అనుకున్నాడట. తారకరత్నకు నివాళి అర్పించిన అనంతరం డైరెక్టర్ అనిల్ రావిపూడి మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు. నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో తారక రత్న కోసం ఓ పాత్రను రెడీ చేయాలని బాలకృష్ణ తనకు సూచించినట్టు అనిల్ రావిపూడి చెప్పాడు. ఈ చిత్రం ముందుగా నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. అయితే తారకరత్న ఆకస్మిక మరణంతో షూటింగ్ వాయిదా పడ్డది.
ఒకవేళ ఎన్బీకే 108లో తారకరత్న నటించి ఉంటే కెరీర్లో చాలా ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోయేదనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు తారకరత్నకు గ్రాండ్ సెకండ్ ఇన్నింగ్స్ షురూ అయ్యేదని అంటున్నారు సినీ జనాలు. బాలకృష్ణ-తారకరత్న మధ్య మంచి అనుబంధం ఉండేది. అయితే తారకరత్న హఠాత్తుగా ఇలా అందరినీ వదిలివెళ్లడంతో బాబాయి-అబ్బాయిని ఒకే ఫ్రేమ్‌లో చూడాలన్న అభిమానుల కళ నెలవేరకుండా పోయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

