Tamil Nadu CM Vijay | తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హీరో విజయ్ తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. మంగళవారం సేలం జిల్లాలోని మేట్టూరు జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన ఆయన, స్టాన్లీ జలాశయం గేట్లు ఎత్తి సాగునీటి విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం విజయ్ రోడ్డు మార్గంలో విమానాశ్రయానికి బయలుదేరారు. ఈ ప్రయాణంలో భాగంగా మార్గమధ్యలో అనుకోకుండా ఒక వ్యవసాయ పొలం దగ్గర తన కాన్వాయ్‌ను ఆపారు.
అయితే అక్కడ పొలంలో పనిచేస్తున్న వృద్ధ మహిళల వద్దకు నడుచుకుంటూ వెళ్లిన విజయ్, వారిని ఆప్యాయంగా పలకరించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న చెల్లమ్మ అనే వృద్ధురాలు సీఎం విజయ్ను చూసి సంతోషంతో ఆయన చేయి పట్టుకున్నారు. కొద్దిసేపు ఆమెతో ముచ్చటించిన విజయ్, ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన కళ్లకు ఉన్న సుమారు రూ. 50 వేల రూపాయల విలువైన ఖరీదైన ‘క్రిస్టియన్ డియోర్’ (Christian Dior) సన్‌గ్లాసెస్‌ను తీసి ఆ బామ్మ కళ్లకు అలంకరించారు.
ఈ ఊహించని పరిణామానికి భావోద్వేగానికి గురైన చెల్లమ్మ, విజయ్ తన సినిమాల్లో ఎలా కనిపిస్తారో నిజ జీవితంలో కూడా అలాగే ఉన్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఎవరైనా ఆయనకు హాని తలపెట్టాలని చూస్తే నేను కాపలాగా నిలబడతాను అని ఆమె సంతోషంగా చెప్పారు. అంతేకాకుండా, తాను ఇంకా భోజనం చేయలేదని చెప్పడంతో, సీఎం విజయ్ ఆమెను వెంటనే వెళ్లి భోజనం చేయాలని సూచించారు. ఈ చిన్న పర్యటనలో భాగంగా ఆ కుటుంబ సభ్యులకు ధోతులు, చీరలను కూడా బహుమతిగా అందజేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
#WATCH | Salem | Tamil Nadu CM Joseph Vijay visits the house of a farmer and gifts his glasses to an elderly woman in Mettur
(Source: TN CMO) https://t.co/VQy07Jy7kt pic.twitter.com/NhZN3FfXmF
— ANI (@ANI) September 1, 2026