Hero Vishal | వారికి లంచం ఇచ్చా.. ముంబయి సెన్సార్ అధికారులపై హీరో విశాల్ సంచలన ఆరోపణలు
Vishal | తమిళ హీరో విశాల్ ముంబయి సెన్సార్ అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. తన తాజా చిత్రం ‘మార్క్ ఆంటోని’ హిందీ సెన్సార్ పనుల కోసం సంబంధిత అధికారులకు 6.5లక్షలు (3లక్షలు స్క్రీనింగ్ కోసం, 3.5 లక్షలు సర్టిఫికెట్ కోసం) లంచంగా ఇచ్చానని తెలిపారు.
Hero Vishal | తమిళ హీరో విశాల్ ముంబయి సెన్సార్ అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. తన తాజా చిత్రం ‘మార్క్ ఆంటోని’ హిందీ సెన్సార్ పనుల కోసం సంబంధిత అధికారులకు 6.5లక్షలు (3లక్షలు స్క్రీనింగ్ కోసం, 3.5 లక్షలు సర్టిఫికెట్ కోసం) లంచంగా ఇచ్చానని తెలిపారు. ముంబయి సెన్సార్ ఆఫీస్‌లో అవినీతి పెచ్చు మీరిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు విశాల్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ‘నా కెరీర్లో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. మరో మార్గం లేక డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. కష్టపడి సంపాదించిన డబ్బు ఇలా అవినీతికూపంలోకి వెళ్లకూడదు.
నాలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఏ నిర్మాతకూ రావొద్దని కోరుకుంటున్నా. చివరకు న్యాయమే గెలుస్తుందని నమ్ముతున్నా. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేల దృష్టికి తీసుకెళ్తాను’ అని తెలిపారు. డబ్బులు తీసుకున్న వారి పేర్లు, బ్యాంక్ ఖాతా వివరాలను విశాల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ‘మార్క్ ఆంటోని’ చిత్రం ఈ నెల 15న తెలుగు, తమిళంలో విడుదల కాగా..హిందీలో గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

