‘ప్రిన్స్’ యూనివర్సల్ సబ్జెక్ట్
‘రెమో’, ‘డాక్టర్ వరుణ్' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో శివ కార్తికేయన్. ఆయన నటించిన కొత్త సినిమా ‘ప్రిన్స్' రేపు విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి అనుదీప్ కేవీ దర్శకత్వం వహించారు.
‘రెమో’, ‘డాక్టర్ వరుణ్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో శివ కార్తికేయన్. ఆయన నటించిన కొత్త సినిమా ‘ప్రిన్స్’ రేపు విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి అనుదీప్ కేవీ దర్శకత్వం వహించారు. సునీల్ నారంగ్, డి సురేష్ బాబు, పూస్కుర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా చిత్ర విశేషాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపారు హీరో శివ కార్తికేయన్.
ఈ సినిమాతో మీ ప్రయాణం ఎలా మొదలైంది?
ఇటీవల మన సినిమాల్లో వినోదం తగ్గిపోతున్నది. మంచి హ్యూమర్ ఉన్న చిత్రంలో నటించాలని అనిపించింది. ఒక స్నేహితుడి ద్వారా అనుదీప్‌ని కలిస్తే బాగా నవ్వించే కథ చెప్పారు. ఈ కథతో సినిమా బాగుంటుందని నిర్ణయించుకున్నాం. కథ పరంగా చూస్తే ఇదొక యూనివర్సల్ సబ్జెక్ట్. తెలుగు, తమిళం అనే తేడా లేకుండా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది.
ఈ చిత్ర కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలేమిటి?
ఒక భారతీయ యువకుడు బ్రిటీష్ అమ్మాయి ప్రేమలో పడతాడు. అతని ఊరి మనుషులకు ప్రేమ, పెళ్లి వంటి విషయాల్లో సంప్రదాయ ఆలోచనా ధోరణి ఉంటుంది. కథానాయకుడు వాళ్ల దృక్పథాన్ని ఎలా మార్చాడు, ప్రేమించిన అమ్మాయిని తన వాళ్ల ఆమోదంతో ఎలా పెళ్లి చేసుకున్నాడు అనేది కథాంశం. దర్శకుడు అనుదీప్ చిత్రీకరించే పాత్రల్లో అమాయకత్వం ఉంటుంది. ఈ చిత్రంలోనూ అలాంటి క్యారెక్టర్లను చూస్తారు.
ఇందులోని ఇతర ముఖ్య పాత్రల గురించి..
నా తండ్రి క్యారెక్టర్లో సత్యరాజ్ నటించారు. ఆయనకు కులం, మతం అనే పట్టింపులు ఉండవు. మన మతం, కులం కాని అమ్మాయినే పెళ్లి చేసుకోమని చెబుతుంటారు. ఆయనది ప్రత్యేకమైన పాత్ర. సత్యరాజ్, నేను చేసిన సన్నివేశాలకు మంచి పేరొస్తుందని
ఈ సినిమాకు ఎదురైన సవాళ్లేంటి?
తెలుగు కథను తమిళ నేటివిటీకి మార్చడం సవాలుగా మారింది. ఇకపైనా ఇలాంటి ద్విభాషా చిత్రాల్లో నటించాలని ఉంది. హీరో విజయ్, దర్శకుడు వంశీ పైడిపల్లితో సినిమా చేస్తున్నారు. రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో పనిచేస్తున్నారు. ఇలా రెండు పరిశ్రమల వారు కలసి సినిమాలు చేయడం మంచి పరిణామం. దక్షిణాది పరిశ్రమ ప్రస్తుతం గొప్ప స్థితిలో ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

