Satyaraj | తమిళ నటుడు, బాహుబలి సిరీస్‌లో కట్టప్ప పాత్ర పోషించిన సత్యరాజ్‌కు కరోనా సోకింది. ఆయనకు గత కొన్ని రోజుల కిందటనే కరోనా సోకగా.. ఇంట్లోనే ఐసోలేట్ అయ్యాడు. అయితే.. గత రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి సీరియస్ అవడంతో ఆయన్ను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే పలు సినిమా ఇండస్ట్రీలలోని సెలబ్రిటీలకు కరోనా సోకింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, మంచు లక్ష్మికి కరోనా సోకిన విషయం తెలిసిందే. వీళ్లంతా ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.