Daniel Balaji | చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ (Daniel Balaji) గుండెపోటుతో (cardiac arrest) ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం ఆయన వయసు 48. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు ధృవీకరించారు. అనారోగ్యం కారణంగా ఇటీవలే ఆసుపత్రిలో చేరిన డేనియల్ బాలాజీ చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. డేనియల్ మరణవార్త తెలుసుకున్న ప్రముఖ నటులు, పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు.
ఇక ఘర్షణ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన డేనియల్ తర్వాత టక్ జగదీష్‌తో పాటు పలు సినిమాలో నటించారు. ఇతడు నటించిన వడ చెన్నై, కమల్ హాసన్ రాఘవన్ సినిమాలు అతడికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.