నాగసాధు పోరాటాలు
తమన్నా భాటియా ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రెస్టేజియస్ థ్రిల్లర్ ‘ఓదెల 2’. మూడేళ్ల క్రితం వచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్' సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకుడు.
తమన్నా భాటియా ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రెస్టేజియస్ థ్రిల్లర్ ‘ఓదెల 2’. మూడేళ్ల క్రితం వచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకుడు. డి.మధు నిర్మాత. ఇందులో తమన్నా నాగసాధు పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. శనివారం ఆమె పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ నాగసాధు అవతారంలో ఉన్న తమన్నా తాజా పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
ఈ పోస్టర్లో పుర్రెలపై ధైర్యంగా నడుస్తున్న తమన్నాను చూడొచ్చు. ఆకాశంలో ఎగురుతున్న రాబందులు ఈ పోస్టర్లో ప్రత్యేక ఆకర్షణ. ఈ సినిమాలో తమన్నాపై భారీ పోరాట సన్నివేశాలు కూడా ఉంటాయని, వాటికోసం ఆమె ప్రాపర్‌గా ట్రైనింగ్ కూడా తీసుకున్నదని, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వనున్నదని మేకర్స్ తెలిపారు.
హెబ్బాపటేల్, వశిష్ట ఎన్.సింహ, యువ, నాగమహేశ్, వంశీ, గగనవిహారి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సౌందర్‌రాజన్.ఎస్, సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, సమర్పణ: సంపత్‌నంది, నిర్మాణం: మధు క్రియేషన్స్, సంపత్‌నంది టీమ్‌వర్క్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

