Tamannah Bhatia | తన అందం, నటనతో ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్లో కుర్రకారును అభిమానులుగా మార్చుకున్నది తమన్నా. తన ఫిట్నెస్ కాపాడుకోవడానికి రెగ్యులర్‌గా జిమ్‌లో వర్కవుట్లు చేస్తుంటుంది. వెయిట్ లిఫ్టింగ్, కార్డియో ఎక్సర్సైజ్లు చేస్తూ చెమటలు చిందిస్తుంది.
ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆమె షేర్ చేసిన కసరత్తు ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తన సౌందర్య రహస్యం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే అని చెబుతున్నది. రెగ్యులర్‌గా వర్కవుట్లు చేస్తే బలంగా, ఆరోగ్యంగా ఉంటారని చెప్పుకొచ్చిందీ మిల్కీబ్యూటీ! ఆలస్యమెందుకు.. చలో జిమ్!