Suriya 43| కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రస్తుతం కంగువ (Kanguva) సినిమాతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. సూర్య 42గా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. మరోవైపు సూర్య ఆకాశం నీ హద్దురా (సూరారై పోట్రు) ఫేం సుధాకొంగర (Sudha Kongara) డైరెక్షన్లో సూర్య 43 (Suriya 43)కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
తమన్నా బాటియా బాయ్‌ఫ్రెండ్, యాక్టర్ విజయ్ వర్మ ఇందులో విలన్‌గా కనిపించబోతున్నాడని ఓ వార్త ఇండస్ట్రీ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో నజ్రియా ఫీ మేల్ లీడ్ రోల్లో కనిపించనున్నట్టు వార్తలు వస్తుండగా.. సూర్య సోదరుడి పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించబోతున్నాడట. మరి ఈ వార్తలపై సుధా కొంగర టీం నుంచి అధికారిక ప్రకటన వస్తే క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్‌లో షురూ కానున్నట్టు సమాచారం.
సూర్య 43 గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో రాబోతుందని ఇన్సైడ్. ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలపై త్వరలోనే క్లారిటీ రానుంది. సూర్య ఇక వెట్రిమారన్ విడుతలై పార్ట్ 2 పూర్తి చేసిన తర్వాత వాడివాసల్ షూటింగ్ కూడా మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడట.