ఎస్.ఆర్.కె ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం ‘తారంగ’. ఇమ్మార్చెల్, డాండి హీరోలుగా నటించారు. ఎస్.సంపత్‌కుమార్ దర్శకుడు. శ్రీనివాస రెడ్డి నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూలైలో విడుదలకానుంది.
ఈ సందర్భంగా ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘వినూత్నమైన కథ ఇది. వినోదంతో పాటు భావోద్వేగాలతో సాగుతుంది. అన్ని వర్గాల వారిని మెప్పిస్తుంది’ అన్నారు. లవ్, కామెడీ ప్రధానంగా ఈ సినిమా ఆకట్టుకుంటుందని నిర్మాత శ్రీనివాస రెడ్డి తెలిపారు