Taapsee Pannu | కంగనాతో వివాదంపై తొలిసారి తాప్సీ ఘాటు వ్యాఖ్యలు.. ‘మన మాటలు మన పెంపకాన్ని చూపిస్తాయి’..!
Taapsee Pannu | బాలీవుడ్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే నటీమణుల్లో కంగనా రనౌత్, తాప్సీ పన్ను ముందువరుసలో ఉంటారు. కొన్నేళ్ల క్రితం వీరిద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా జరిగిన మాటల యుద్ధం బాలీవుడ్లో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే తాజాగా ఈ వివాదంపై తాప్సీ పన్ను మరోసారి స్పందించింది.
Taapsee Pannu | బాలీవుడ్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే నటీమణుల్లో కంగనా రనౌత్, తాప్సీ పన్ను ముందువరుసలో ఉంటారు. కొన్నేళ్ల క్రితం వీరిద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా జరిగిన మాటల యుద్ధం బాలీవుడ్లో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే తాజాగా ఈ వివాదంపై తాప్సీ పన్ను మరోసారి స్పందించింది. కంగనాతో తనకు ఇప్పటివరకు నేరుగా పరిచయం కూడా లేదని చెబుతూనే.. వ్యక్తుల వ్యాఖ్యలు వారి పెంపకం, ప్రపంచాన్ని చూసే విధానాన్ని ప్రతిబింబిస్తాయని వ్యాఖ్యానించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీని కంగనా రనౌత్తో ఉన్న విభేదాల గురించి ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. కంగనాను ఇప్పటివరకు తాను నేరుగా కలవలేదని తెలిపింది.
వివాదాలు మొదలయ్యే ముందు కూడా, ఆ తర్వాత కూడా ఆమెను వ్యక్తిగతంగా కలిసిన సందర్భం లేదని తాప్సీ స్పష్టం చేసింది. అయితే ఇద్దరి మధ్య గతంలో చోటుచేసుకున్న సోషల్ మీడియా వివాదాలపై తన అభిప్రాయాన్ని మాత్రం వెల్లడించింది. కంగనాతో జరిగిన వివాదాల గురించి మాట్లాడుతూ తాప్సీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తి మరొకరి గురించి ఎలా మాట్లాడుతున్నారనే విషయం వారి కుటుంబ నేపథ్యం, పెంపకం, ప్రపంచాన్ని చూసే విధానం గురించి తెలియజేస్తుందని ఆమె అభిప్రాయపడింది. ఒకరి వ్యాఖ్యలను బట్టి వారు ఎలాంటి వాతావరణంలో పెరిగారో అర్థం చేసుకోవచ్చని పేర్కొంది. తన వ్యాఖ్యలు ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికి కాదని, సాధారణంగా వ్యక్తుల ప్రవర్తన గురించి చెబుతున్నాననే విధంగా తాప్సీ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
గతంలో తాప్సీ, కంగనా మధ్య వివాదం సోషల్ మీడియాలో తీవ్రస్థాయికి చేరింది. కంగనా సోదరి రంగోలి చందేల్.. తాప్సీని ‘సస్తీ కాపీ’ అంటూ విమర్శించింది. ఆ తర్వాత కంగనా కూడా తాప్సీని ‘బి-గ్రేడ్ నటి’ అంటూ వ్యాఖ్యానించడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. అయితే తాను ఎప్పుడూ కంగనాకు వ్యతిరేకంగా మాట్లాడలేదని తాప్సీ చెప్పింది. కంగనా మంచి నటి అని అంగీకరించడానికి తనకు ఎలాంటి అహం లేదని స్పష్టం చేసింది. వ్యక్తిగత విభేదాలు ఉన్నప్పటికీ ఒక నటిగా కంగనా ప్రతిభను తాను గౌరవిస్తాననే సంకేతాన్ని తాప్సీ ఇచ్చింది. ఇదే ఇంటర్వ్యూలో తాప్సీ తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలకు కూడా క్లారిటీ ఇచ్చింది. తాను రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేసింది. తాను చాలా నిజాయితీగా, సున్నితంగా ఉండే వ్యక్తినని.. రాజకీయాల్లో కొనసాగేందుకు అవసరమైన స్వభావం తనలో లేదని తాప్సీ చెప్పింది. ప్రస్తుతం తన దృష్టి మొత్తం మంచి కథలు, విభిన్నమైన సినిమాలు చేయడంపైనే ఉందని తెలిపింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

