Swetha Varma: బాధతో బయటకు వచ్చేసిన శ్వేత.. సీక్రెట్ రూంలో ఇబ్బందులు పడుతున్నలోబో

సరదాగా సాగిన సండే ఎపిసోడ్లో నాగార్జున కళ్లకు గంతలు కూడా ఆటలాడించాడు. కళ్లకు గంతలు కట్టుకున్నవారు మిగతా వారి డైరెక్షన్ తో హూలా హూప్స్ మధ్యలో పెట్టిన బోన్‌ను అందుకోవలసి ఉంటుంది. రెండు టీంలలో ఎవరు ముందు బోన్ అందుకుంటారో వారు గెలిచినట్టు అని నాగ్ తెలియజేశాడు. ఈ గేమ్లోను టీమ్ ఏనే గెలుపొందింది. అయితే ఈ వారం నామినేట్ పది మంది సభ్యులలో నాగార్జున 8 మందిని సేవ్ చేయగా, చివరకు సిరి,శ్వేత మిగిలారు.
వారిద్దరిని గార్డెన్ ఏరియాకు రమ్మన్నాడు నాగ్. సుత్తితో అక్కడున్న డబ్బాను పగలగొట్టమన్నాడు. అందులో వచ్చిన మరో బాక్సును లివింగ్ ఏరియాకు తీసుకురమ్మని చెప్పాడు.. ఆ డబ్బాలో సిరి బొమ్మ ఉండటంతో ఆమె సేఫ్ అయినట్టు నాగ్ ప్రకటించాడు. దీంతో శ్వేత ఎలిమినేట్ అయినట్టుగా తెలియజేశాడు.శ్వేత భారమైన హృదయంతో హౌజ్‌ని వీడింది. అందరికి బైబై చెప్పి స్టేజ్ మీదకు వచ్చిన శ్వేతతో నాగ్ ఒక గేమ్ ఆడించారు.
సైన్ గేమ్ లో భాగంగా శ్వేత వర్మ ఒక్కో కంటెస్టెంట్ గురించి తన అభిప్రాయాన్ని చెప్పేసింది. రవికి దూరంగా ఉండాలి.. నాకు అల్రెడీ అనుభవం అయింది. ఆయన ఆట బాగానే ఆడతాడు. అందులో బెస్ట్. కానీ ఆయన ఆట వల్ల మిగతా వాళ్లకు ఎఫెక్ట్ అవుతుంది అంటూ శ్వేతా వర్మ చెప్పుకొచ్చింది. ఇక మానస్ డేంజర్ జోన్ అని పేర్కొంది. ఫ్యూయల్ ట్యాంక్‌గా రీచార్జ్ చేయించే వ్యక్తిగా శ్రీరామచంద్రను శ్వేత పేర్కొంది. ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఇస్తాడని తెలిపింది.
తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయండి అంటూ ఆనీ మాస్టర్‌కు చెప్పింది. టాప్ 5లో మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నట్టు శ్వేత తెలిపింది. డెడ్ ఎండ్, యూటర్న్ వంటివాటిని కాజల్‌కు ఇచ్చింది. మాట మార్చిందని, అది తన ఆట కూడా కావొచ్చు అని శ్వేత చెప్పుకొచ్చింది . విశ్వ ఈ గేమ్ నుంచి డైవర్ట్ అయ్యాడని డైవర్షన్ అని ఇచ్చింది. నచ్చిన వాళ్లు వెళ్లిపోతూ ఉండటంతో ఆ ఎఫెక్ట్ ఆయన మీద పడి ఉంటుందని శ్వేత తెలిపింది. ఇక సీక్రెట్ రూంలో ఉన్న లోబో చాలా ఇబ్బంది పడుతూ కనిపించాడు. నీకో బిగ్ బ్రదర్‌గా చెప్తున్నా.. ఈ అవకాశాన్ని బాగా వాడుకో.. అంటూ సలహా ఇచ్చాడు నాగార్జున.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

