ఆంజనేయుడి భక్తుడిగా నిఖిల్
హనుమాన్'కు విశేష ప్రేక్షకాదరణ లభించింది. ఇండియన్ సూపర్ మాన్‌గా తెరకెక్కిన ఈ సినిమా సగటు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నది.
‘హనుమాన్’కు విశేష ప్రేక్షకాదరణ లభించింది. ఇండియన్ సూపర్ మాన్‌గా తెరకెక్కిన ఈ సినిమా సగటు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నది. ఈ నేపథ్యంలో రాబోయే పాన్ ఇండియా సినిమాల్లో ఆంజనేయుడి రిఫరెన్స్ ఉండటం కాకతాళీయమే అనిపిస్తోంది. నిన్న చిరంజీవి ‘విశ్వంభర’లో ఏకంగా పెద్ద అంజనీ పుత్రుడి విగ్రహాన్ని చూపించడం ద్వారా కథలో కీలకం కానున్నాడని చెప్పకనే చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి హనుమకు పరమ భక్తుడు అయినందువల్ల హనుమంతుడి సన్నివేశాలకు ప్రాధాన్యం ఉండటమనేది సహజమే. తాజాగా ఈ జాబితాలో మరో సినిమా చేరింది. ‘స్వయంభు’లో తాను హనుమంతుడి భక్తుడిగా నటిస్తున్నట్లు ఆ చిత్ర కథానాయకుడు నిఖిల్ స్వయంగా ప్రకటించడం ద్వారా ముఖ్యమైన క్లూ ఇచ్చేశాడు. ఇతిహాసాల నేపథ్యంలో భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న ఎపిక్ డ్రామా ఇది. ‘స్వయంభు’ వచ్చే దసరా లేదా దీపావళికి విడుదలకు ప్రయత్నిస్తున్నారు. ‘కేజీఎఫ్’, ‘సలార్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకు సంబంధించి క్యాస్టింగ్‌ను ఇంకా ప్రకటించలేదు. నిఖిల్ హీరోగా రామ్‌చరణ్ నిర్మిస్తున్న ‘ది ఇండియా హౌస్’ మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Hanuman Movie
- hero Nikhil
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

